Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Fires On Pm Modi

Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ

Published Date :March 26, 2023 , 6:44 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ పేరుతో కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌ గాంధీభవన్‌లోనూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. బ్రిటీష్ విధానాలనే బీజేపీ అమలు చేస్తుందని, బీజేపీని ఈ రోజు నుంచి బ్రిటీష్ జనతా పార్టీగా పిలుద్దామని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చేది కాదని అమిత్ షా అంటున్నాడన్నారు. వల్లభాయ్ పటేల్ కి మీ పార్టీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడని, ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీభవన్ కి పునాది వేసింది కూడా వల్లభాయ్ పటేలే అని, అదానీ కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క సూరత్ నుంచే మొదలైందన్నారు.

Also Read : Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు

Also Read

  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
  • Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
  • Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..

బ్రిటీష్ తెచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ లెక్క బీజేపీ కూడా అదానీ కంపెనీలతో దేశ సంపదను కొల్లగొడుతుందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలో గుజరాత్ లో కేస్ ఎలా వేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. అదానీ దోపిడీపై పార్లమెంటులో మోడీని రాహుల్ కడిగేశారని, రాహుల్ గాంధీని చూడాలంటే మోడీకి భయం పట్టుకుందన్నారు. అదానీ కంపెనీలో 23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరో తేలాలి? అని ఆయన డిమాండ్‌ చేశారు. అదానీ దొంగతనం చేశారంటే మోడీ ఎందుకు భయపడుతున్నాడని, అదానీపై ఈడీ విచారణ జరగాలంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. ఫిబ్రవరి 7న రాహుల్ గాంధీ మాట్లాడితే.. 16న హైకోర్టులో స్టే తెచ్చుకున్న కేసును ఓపెన్ చేశారన్నారు. ఫిబ్రవరి 27న కిందికోర్టులో కేసు విచారణ మొదలుపెట్టారని, మార్చి 23న రాహుల్ గాంధీకి శిక్ష వేశారన్నారు. కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజులు గడువు ఇచ్చిందని, కానీ తెల్లారగానే పార్లమెంటులో రాహుల్ గాంధీని అనర్హత వేటు వేశారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒక ఇంజన్ అదానీ… రెండో ఇంజన్ ప్రధాని అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అదానీ ఇంజన్ రిపేరుకు రాగానే ప్రధాని ఇంజన్ పాడైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పప్పు అని చెప్పిన బీజేపీకి ఇప్పుడు నిప్పులా కనపడుతున్నాడని, అందుకే నిప్పును అడ్డు తొలగించుకోవాలని మోడీ కుట్ర చేశాడని ఆయన ఆరోపించారు.

Also Read : YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • congress
  • latest news
  • rahul gandhi
  • revanth reddy

తాజావార్తలు

  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!

  • CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!

  • Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!

  • Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..

  • Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions