NTV Telugu Site icon

Revant Reddy : కేంద్రం నిబంధనలు కూడా పక్కకు పెట్టారు యువరాజు

Revanthreddy

Revanthreddy

కేబీఆర్‌ పార్క్‌ దగ్గర 5.30 గుంటల భూమిని ఫైవ్ స్టార్ హోటల్ కేటాయించారని, 2009 లో మేటాస్ సంస్థ వాటా 30 శాతం వాటా తీసుకుందన్నారు టీపీసీసీ చీఫ రేవంత్‌ రెడ్డి. 85 శాతం పెట్టుబడులు మంత్రి సంస్థ కొనుగోలు చేసిందని, మూడు అంతస్థులకు అనుమతి వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కి సంబందించిన వాళ్ళ కండ్లలో ఈ భూమి పడిందని, 2016 లో మంత్రి సంస్థ 3 అంతస్తుల సెల్లార్ తో పాటు 7 అంతస్తులు అనుమతి అడిగిందన్నారు. అంతేకాకుండా..’2018 లో అనుమతి ఇచ్చింది జీహెచ్ఎంసీ అని, 2022 లో ఇంకో ఐదు అంతస్థులకు ధరకస్తూ పెట్టుకున్నారన్నారు. రివైజ్డ్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు.. కేటీఆర్ కి మంత్రి సంస్థ జుట్టు దొరికిందని, . 2016 లో దరఖాస్తు పెట్టుకోగానే… Rnr డవలపర్స్…వీర వెంకట రామారావు 2017 లో ఏర్పాటు చేశారు. . మంత్రి డవలపర్స్ లో.. rnr జాయింట్ వెంచర్ గా ఒప్పందం కి వచ్చింది. 2018 లో ఏడు అంతస్థుల మెడకు అనుమతి వచ్చింది.

Also Read : CM Jagan Mohan Reddy: గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష.. వాటిని తిప్పికొట్టాలంటూ సూచన

ఇద్దరు కలిసి.. మళ్ళీ ధరకస్తూ పెట్టారు. ఇంకో ఐదు అంతస్థులకు అనుమతి అడిగారు. 2022 లో 17 అంతస్థులకు అనుమతి ఇచ్చారు. కేబీఆర్‌ పార్క్ లో ఫ్లవర్ తెంచినా… చర్యలు తీసుకుంటారూ.. కేబీఆర్‌ కాంపౌండ్ అనుకోని అనుమతి ఎలా ఇచ్చారు. కేంద్రం నిబంధనలు కూడా పక్కకు పెట్టారు యువరాజు. నిరంజన్ అసోసియేట్స్ రూపొందించిన రిపోర్ట్ లో అన్ని వివరాలు పేర్కొన్నారు. రాజకీయ పరిణామాలు ఎక్కడ జరిగినా తెలుస్తాయి అంటున్నారు కేసీఆర్. అలాంటి కేసీఆర్ కి… జూబ్లీహిల్స్ సర్కిల్ జరుగుతున్న దోపిడీ కనిపించడం లేదా..?. నీ కొడుకు హైదరాబాద్ విధ్వంసం చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. వాకర్స్ అసోసియేషన్ కి అప్పీల్ చేయండి.. హైకోర్టు లో పిల్ వేయండి. ఉదయం నుండి కేబీఆర్‌ పార్క్ చుట్టూ..నా ఇంటి చుట్టూ పోలీసులు.. నేనేమైన ఆర్బీఐని దోపిడీ చేస్తా అన్నానా’ అంటూ ధ్వజమెత్తారు రేవంత్‌ రెడ్డి.

Also Read : MLA Shanampudi Saidireddy : ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీలుగా మారాయి

Show comments