కేసీఆర్, కేటీఆర్‌లు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ లాగు తొడగక ముందే తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిందని ఆయన అన్నారు. కేసీఆర్ కంటే ముందే మర్రి చెన్నారెడ్డి, మదన్ మోహన్ లాంటి నేతలు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని, 1996లో గద్దర్ తెలంగాణ జనసభ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని చాటారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. 2000లో కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నరెడ్డి 42 మంది ఎమ్మెల్యే లతో తెలంగాణ కూడా అనుకూలంగా సంతకాలు చేపించి సోనియా గాంధీ కి పంపారని వెల్లడించారు. చర్లపల్లి జైల్లో కేసీఆర్‌కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని మరోసారి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.
Also Read : Prabhas: రాముడు వచ్చాడు కానీ రాక్షసుడు రాలేదు
తెలంగాణ ఉద్యమకారులను ఆగం చేసిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తన ఓటమిని ఎమ్మెల్యేల ఖాతాలో రాయడానికి సిద్దమయ్యారని, కేసీఆర్ సిట్టింగులకు సీటు ఇస్తా అని చెప్పగలరా..? అని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే ప్రకటించు అని ఆయన కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడగండని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి.
Also Read : Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు వడ ప్రసాదం అందుబాటులోకి తెచ్చిన దేవస్థానం
