NTV Telugu Site icon

Revanth Reddy : కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది

Revanthreddy

Revanthreddy

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ధర్మపురిలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అన్నారు. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లను కక్కిస్తామని, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను కొరడాతో కొట్టినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ 200 ఎకరాల్లో వరి పండించి 1కోటి 80లక్షలు సంపాదించిండని, కేసీఆర్ వడ్లను కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండన్నారు. కానీ తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2వేల చొప్పున కూడా కొనడం లేదన్నారు రేవంత్‌ రెడ్డి..

అంతేకాకుండా.. ‘కేసీఆర్ ఇదేనా రైతులపై నీకున్న ప్రేమ… ఇదేనా నువ్వు చెప్పే రైతు ప్రభుత్వం ? గెలిచినా ఓడినా.. లక్ష్మణ్ మీకు అండగా నిలబడ్డాడు.. మీకోసం పోరాటం చేశారు.. మీరు అభిమానంతో గెలిపించినా కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపి గెలుపు తమదని ప్రకటించుకున్నారు. మొరాయించిన ఈవీఎంలను మళ్లీ లెక్కించాలంటే కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారు. కుట్రపూరితంగా కొప్పుల గెలిచినా ఈ ప్రాంతానికి ఆయన చేసిందేం లేదు.. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి నిధులు వచ్చాయి.. అభివృద్ధి జరిగింది. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లను కక్కిస్తాం.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? కేసీఆర్ను కోరడాతో కొట్టినా తప్పులేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి… కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది. తెలంగాణలో మార్పు కావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ 200 ఎకరాల్లో వరి పండించి. 1కోటి 80లక్షలు సంపాదించిండు. కేసీఆర్ వడ్లను కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండు.. కానీ తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2వేల చొప్పున కూడా కొనడం లేదు. కేసీఆర్ ఇదేనా రైతులపై నీకున్న ప్రేమ… ఇదేనా నువ్వు చెప్పే రైతు ప్రభుత్వం?’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Show comments