మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా సాగుతోంది. చండూర్ మండలంలో ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు తీర్పు కోసం ప్రజలందరూ వేచి చూస్తున్నారు డబ్బులు ఇచ్చే వాళ్ళ వైపు ఉంటారా నిజాయితీగా ఉండే వాళ్ళ వైపు ఉంటారా అని ప్రపంచమంతా చూస్తోందన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చాడా అని ప్రశ్నించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా… యువకులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చాడా? ఇవేవీ రాలేదు.
ఇప్పుడు ఎన్నికలు రాగానే కుప్పగట్టుకుని వచ్చి ఏవేవో మాటలు చెబుతున్నారు కొద్దిగా ఆలోచించి ఓటేయండి. 2018 లో రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తే 22వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే నాకు చేతనైతలేదంటూ భయపడి బిజెపి పంచన చేరాడు. కెసిఆర్ తో కొట్లాడమని పంపిస్తే కేసీఆర్కు భయపడి మోడీ దగ్గర చేరాడు. జీఎస్టీ పేరుతో చంటి పిల్లలు తాగే పాలకు కూడా జీఎస్టీ పేరుతో లక్షల రూపాయల పన్నులను వేస్తున్నారు ఇలాంటి బీజేపీకి ఓట్లు వెయ్యాలా? మద్యం పోయకుండా ఓట్లు అడుగుదామని ఆడబిడ్డ చేసిన సవాలకు రెండు పార్టీలో వాళ్ళు పారిపోయారు ఈ సన్యాసులు.
ఈ నియోజకవర్గంలో 1,25,000 మహిళల ఓట్లు ఉన్నాయి మీ ఓట్లు మీ ఆడబిడ్డ చేయండి మీరే గెలిపించుకోవచ్చు. ఎన్నికల్లో ఈ ఆడబిడ్డ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో నలుగురి ఆడబిడ్డలకు టిక్కెట్లు ఇప్పించే బాధ్యత నాది. ఈ అడబిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాం నిలబెడతారా చంపుకుంటారా మీ ఇష్టం అన్నారు రేవంత్ రెడ్డి. ప్రచార సరళి ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు కొత్తవారు కాదు..వాళ్ళు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వాళ్ళు మునుగోడు అభివృద్ధి చేయాలని ఉంటే. ఇప్పటికే చేయాలి. కేసీఆర్ డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నారు 8 ఏళ్ళు అవుతున్న కట్టలేదు.
Read Also: Kantara: ‘కాంతార’ శబ్దాలకు గుండెపోటు.. అభిమాని మృతి
కనీసం రోడ్లు కూడా లేదు. ..గిరిజనులకు భూముల ఇచ్చిన వాళ్ళ వి కూడా గుంజుకున్నారు. రాచకొండ ఫిలిం సిటీ కోసం గిరిజన భూములు లాక్కున్నారు. హెలికాప్టర్ లో తిరిగిన సీఎంకి ఈ భూముల పైన దృష్టి పడింది. కేటీఆర్ కి చెందిన సినిమా మిత్రులకు ఈ భూములకు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. ఏ ఎన్నికలతో యువత తాగుబోతులను చేస్తున్నారు. 6 ఏళ్ల చిన్నారిని గంజాయికి అలవాటు పడ్డ వాడు మానభంగం చేశారు. మద్యం పోయకుండా ఓట్లు అడుగుదాం అని మా అభ్యర్థి సవాల్ చేసిన సవాల్ కి వాళ్ళు సిద్ధంగా లేరన్నారు. మద్యం మత్తులో ఉంచి ఓట్లు కొట్టేయాలి రెండు పార్టీలు ఈ సవాల్ చేయడం లేదు. కాంగ్రెస్ చంపేందుకు టిఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను కాంగ్రెస్ లోని కొందరు వారికి సహకరిస్తున్నారు.
బీజేపీ వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ పైన దాడి చేస్తున్నారు..కేంద్ర భద్రత బలగాలు తో కాంగ్రెస్ ను బయపెట్టుదానికీ ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు తో మనలో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. చండూర్ లో 1న మహిళ గర్జన ఉంది. దీన్ని విజయవంతం చేయండి..రాహుల్ గాంధీ జూడో యాత్రలో అందరూ పాల్గొనాలి. సంఘీభావం తెలపండి. రేపు ఉదయం 6 .30 నుండి ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. మక్తల్ లో జరిగే పాదయాత్ర లో కాంగ్రెస్ శ్రేణులు మమేకం కావాలని పిలుపునిచ్చారు రేవంత్.
Read Also: Minister KTR: చేనేత రంగాన్ని మోడీ ప్రభుత్వం చావుదెబ్బ కొడుతోంది