Site icon NTV Telugu

Revanth Reddy : టీఆర్‌ఎస్‌, బీజేపీ ఉమ్మడి రాజకీయ శత్రువు కాంగ్రెస్

Revanth Reddy Congress

Revanth Reddy Congress

Revanth Reddy fires on bjp and trs: టీఆర్‌ఎస్‌ బీజేపీ రాజకీయ వైరుధ్యం ఉన్నది అని చెప్పే డ్రామా నడుస్తుందంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ రద్దు అవుతుంది కాబట్టీ భయంతో అదే రంగు.. అదే సింబల్ పేరుతో… బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్నాడని ఆరోపించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లు మీరు మాట్లాడేది నిజమే అయితే ఎన్నికల కమిషన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. బెంగాల్ లో కూడా బీజేపీ.. మమత కోట్లాడినట్టు చేసి మమతకి బెనిఫిట్ చేశారని, తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కాంగ్రెస్ మీ దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్నారు.

 

టీఆర్‌ఎస్‌, బీజేపీ ఉమ్మడి రాజకీయ శత్రువు కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్‌ను దెబ్బ తీసే పనిలో బీజేపీ..టీఆర్‌ఎస్‌ ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీతో కొట్లాడే వాడు… కాంగ్రెస్ బలహీన పడింది అంటారా..? అని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ కాంగ్రెస్ బలహీన పడింది అని బీజేపీ బలపడింది అని చెప్పాలని అనుకున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ లాంటి వాడు రాహుల్ గాంధీ పాదయాత్ర పొగడాల్సిన అవసరం లేదని, అలాంటి వాడు పొగిడిన మాకు నష్టమే అన్నారు రేవంత్‌ రెడ్డి.

Exit mobile version