Site icon NTV Telugu

Revanth Reddy : ఖర్గేని చంపడానికి కుట్రపై విచారణ చేయాలి

Revanth Reddy

Revanth Reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మణికంఠ నరేంద్ర రాథోడ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారని ఆరోపించిన రేవంత్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తాపూర్ నియోజకవర్గం నుండి ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారని, ఖర్గే కుమారునిపై మణికంఠ రాథోడ్ తడిపార్ ని బీజేపీ పోటీలో దింపారన్నారు. అయితే.. ఖర్గే ని రౌడీ షీటర్.. బీజేపీ అవతార్ మణికంఠ రాథోడ్ బెదిరించారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఖర్గే కుటుంబాన్ని చంపేస్తా అన్నారని.. ఆడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. బీజేపీ కి రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే… మణికంఠ రాథోడ్ ని పార్టీ నుండి బహిష్కరించాలని, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Also Read : Minister KTR : రాజకీయ నిరుద్యోగులు రాష్ట్ర యువతను రెచ్చగొడుతున్నారు

ఖర్గే ని చంపడానికి కుట్రపై విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా… కేటీఆర్ కి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని, కేటీఆర్ పేరే అరువు తెచ్చుకున్నారన్నారు. తెలంగాణతో కేటీఆర్ కి పేరు బంధమే తప్పా..పేగు బంధం లేదని, కేసీఆర్ కుమారుడు అనేదే అర్హత అన్నారు. ఇందిరా గాంధీ కుటుంబం వారసురాలు.. వాళ్ళ కాళ్ళు మొక్కితే నీకు చేసిన తప్పులలో కొంతైన పాపం తగ్గుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి నమూనా అంటే మూడు వేల వైన్స్.. ఆరు వేల బార్లా స్టడీ చేసేది.. ప్రశ్న పత్రాల లీకు లు ఆదర్శంగా తీసుకోవాలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు అధ్యయనం చేయాలా..? తెలంగాణలో ఏం స్టడీ చేయాలి.. పరాయి రాష్ట్రం నుండి కిరాయి మనుషులను తెచ్చుకుని, సిగ్గులేని మాటలు మానేసి, మర్యాద పూర్వకంగా వచ్చి ప్రియాంక కాళ్ళు మొక్కు, తెలంగాణ ప్రజలను మోసం చేసినం అని క్షమాపణ చెప్పు, అంటూ మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Also Read : GT vs LSG: గుజరాత్ టైటాన్స్ తాండవం.. లక్నో ముందు భారీ లక్ష్యం

Exit mobile version