Site icon NTV Telugu

Revanth Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డి అభినందనలు

New Project (23)

New Project (23)

ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజారిటీ రావడంతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్‌ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.

READ MORE: Kangana: 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పరార్.. లేడీ సూపర్ స్టార్.. కంగన గురించి మీకు తెలియని విషయాలు ఇవే

కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించడంతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు.

Exit mobile version