Site icon NTV Telugu

Revanth Reddy : ఇది హ్యాకింగా, హానీ ట్రాపా, లీకా తేల్చాలి

Revanthreddy Kcr

Revanthreddy Kcr

హాత్‌ సే హాత్‌ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నిజామాబాద్‌లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మోపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీపీసీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వెనుక ఏం జరిగింది? అసలు కారణాలు ఏంటో అధికారులు కానీ, సీఎం కానీ వివరణ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారన్నారు. వివిధ పార్టీల నుండి ఫిరాయించిన వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌లుగా చేశారన్నారు. ఇది రాజకేయ పునరావాస కేంద్రంగా మారిందని ఆయన మండిపడ్డారు. గ్రూప్1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వస్తున్నాయని, ప్రశ్నాపత్రాలు సేఫ్ కస్టడీలో ఉండాలన్నారు. కమిషన్ చైర్మన్, సెక్రెటరీ ల పరిధిలో మాత్రమే ఉండే ప్రశ్నపత్రాలు ఇతరుల చేతికి ఎలా వెళ్లాయని ఆయన అన్నారు. కంప్యూటర్ పాస్ వర్డ్, కోడ్ ప్రవీణ్ అనే వ్యక్తి వద్దకు ఎలా వచ్చాయని, ఇది హ్యాకింగా, హానీ ట్రాపా, లీకా తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత 9 ఏళ్లలో ఏ పోటీ పరీక్షలు కానీ తప్పులు లేకుండా నిర్వహించలేక పోయారన్నారు.

Also Read : Pawan Kalyan: వారాహి ఆపి అంబులెన్స్‌ కు దారి ఇచ్చిన జనసేనాని

ఇందులో ప్రభుత్వ పెద్దలున్నారు.. గూడపుఠానీ నడుస్తోందన్నారు. అందుకే ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఫిర్యాదు చేయలేదని, గతంలో అనేక పరీక్షల్లో టీఆర్‌ఎస్ నాయకుల ప్రమేయాలు బయట పడ్డాయన్నారు. వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 400 మంది ఉద్యోగులు ఉండాలి, కానీ ఇప్పుడు 80 మంది మాత్రమే ఉన్నారు, ఇందులో ఆఫీస్ లో పని చేసేది 30 మాత్రమేనని ఆయన అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక జరిగిన అన్ని పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులపై కానీ మచ్చ రాకుండా విచారణకు సిద్ధం కావాలన్నారు. మీ కుటుంబ సభ్యులకు ఒక్క రోజు కూడా ఉద్యోగం లేకుండా ఉండలేరన్నారు. కానీ 2 లక్షల మంది ఉద్యోగాలపై మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

Also Read : Venugopala Krishna: కేబినెట్లో మార్పులు మీడియా ఊహ మాత్రమే

Exit mobile version