తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ తన అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశపడి భంగపడ్డ నేతలు కొందరు ఆయా పార్టీలను వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారి కుమారుడు మహిపాల్ రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరారు. అయితే.. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బిల్లా రంగాలు పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నారు తెలంగాణ అంతటా అంటూ విమర్శించారు. బిల్లా రంగాలు ఎవరో కాదు కేటీఆర్.. హరీష్ అని ఆయన వ్యాఖ్యానించారు. నీఅయ్యా సీఎం అయినా.. నువ్వు మంత్రి అయినా సోనియాగాంధీ పెట్టిన భిక్ష అని, అమెరికాలో బాత్ రూమ్ లు కడిగే నువ్వు ..మంత్రివి అయ్యావంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Also Read : Vijay Devarakonda: లైగర్ రిజల్ట్ చూశాక కూడా మరోసారి రిస్క్ చేస్తున్నాడంటే.. ఏం గుండెరా అది..?
రబ్బరు చెప్పులతో తిరిగే హరీష్ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మట్లాడుతున్నారని, మా కార్యకర్తలపై ఇన్నాళ్లు కేసులు పెట్టారని, ఇంకో 45 రోజుల్లో మా కార్యకర్తల కు మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అందరూ అధికారుల సంగతి తేల్చుతామన్న రేవంత్ రెడ్డి.. అధికారులకు మిత్తి తో సహా ఇస్తామన్నారు. డీజీపీ.. ఆంధ్ర కేటాయించిన వ్యక్తి.. ఆయన్ని మార్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్టీఫెన్ రవీంద్ర.. మా నాయకుల కు బెదిరింపులు ఇస్తున్నారని, ఎన్నికల అధికారులు వీరిని నియంత్రించండని ఆయన అన్నారు. డ్రామా రావు.. 75 మంది జాబితా సిద్ధం చేశాడని, కాంగ్రెస్ కి సాయం చేసే వాళ్ళను బెదిరిస్తున్నాడన్నారు. ఢిల్లీలో పీయూష్ గోయల్ కి ఇచ్చాడని, వాళ్ళ మీద నిఘా పెట్టాలని సూచించారన్నారు. కేటీఆర్ కొంత మందిని పిలిచి బెదిరిస్తున్నాడనరి, 45 రోజుల తర్వాత కేటీఆర్.. నీకు మిత్తి తో సహా అప్పగిస్తామన్నారు. జయేష్ రంజాన్.. అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు బీఆర్‌ఎస్‌కి నిధులు సమకూర్చే పనిలో ఉన్నారన్నారు. మీ చర్యలు చూస్తున్నామని, అధికారంలోకి వచ్చాక మీ లెక్క తెలుస్తామని, డిసెంబర్ 9 న lb స్టేడియం లో ఆరు గ్యారెంటీ లపై సంతకం పెట్టబోతుందన్నారు. లక్షలాదిగా ఆ రోజు కలుస్తామని, ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9 నా రాబోతోందన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : YS Sharmila : పాలేరు నుంచి పోటీ చేస్తా.. తెలంగాణ ప్రజల కోసం త్యాగానికి సిద్దం అయ్యాను