Site icon NTV Telugu

Revanth Reddy : 111 జీవో రద్దుపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanthreddy

Revanthreddy

కేసీఆర్ 111 జీవో రద్దు చేయడం.. పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపు అప్రజాస్వామిక నిర్ణయమన్నారు రేవంత్‌ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జంట నగరాలకు జలాశయం కట్టారు నిజాం అని, అక్కడ పరిశ్రమలు పెడితే ఎన్జీటీ కి వెళ్లారన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు వద్దని 1994 లో అప్పటి ప్రభుత్వం నిషేధం పెట్టిందన్నారు. ఎన్జీటీ నుండి సుప్రీంకోర్టు కి కేసు వెళ్ళిందని, 1996లో 111 జీవో వచ్చిందన్నారు. 84 గ్రామాలను బయోకన్జర్వేషన్ లో పెట్టారని, జంట జలాశయాలు పరిరక్షణకి కంకణం కట్టుకున్నారు నాటి పాలకులు అన్నారు రేవంత్‌ రెడ్డి. ధన దాహం కోసం.. అస్థవ్యస్థ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘జంట నగరాల్లో విధ్వంసం చేస్తున్నారు. హిరోషిమా..నాగసాకి లపై దాడి కంటే పెద్ద దాడి చేస్తున్నారు కేసీఆర్‌.

Also Read : Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్

పేదల చేతిలో 20 శాతం కూడా లేవు. కేసీఆర్ బినామీలకు.. యువరాజులకు ఎక్కువ భూమి ఉంది. 111 జీవో తొలగింపు ద్వారా…యువరాజు సన్నిహితులను వేళా కోట్లు తెచ్చిపెట్టే ఉద్దేశం ఉంది. కాంగ్రెస్ పోరాటం వల్లనే… కృష్ణ.. గోదావరి జలాలు నగరానికి వచ్చాయి. పైపు లైన్ వేసి జంట నగరాలకు నీళ్లు ఇస్తా అంటున్నాడు. మళ్ళీ పైప్ లైన్ల టెండర్లు తెర మీదకు తెచ్చారు. పైపుల కంపనీ కోసం కేసీఆర్‌ కొత్త ప్రతిపాదన. 111 జీవో ఎత్తివేత వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉంది. కేసీఆర్.. కేటీఆర్ ని క్షమించలేము. దావుద్ ఇబ్రహీం ని అయినా క్షమాపణ అడిగితే ఆలోచించ వచ్చు కానీ. కేసీఆర్.. కేటీఆర్ కి క్షమాపణ పెట్టలేము. కేటీఆర్.. కవిత.. రంజిత్ రెడ్డి.. సంతోష్ లకు భూములు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేత వెనక భారీ భూ కుంభకోణం ఉంది.. విచారణ జరగాలి. కాంగ్రెస్ తరపున నిజ నిర్దారణ కమిటీ. చైర్మన్ గా కోదండ రెడ్డి. అక్కడ ఎవరెవరు భూములు కొన్నారో తేల్చుతం. బీజేపీ నేతలకు సవాల్. బినామీ ఆక్ట్ దీనికి పర్ఫెక్ట్ గా అమలు అవుతుంది. వేల ఎకరాలు కొని… జీవో ఎత్తివేసి లాభం చేకూర్చుకున్నారు.

దీనిపై విచారణ చేయాలి. బినామీ ఆక్ట్ పై… విచారణ జరగాలి. ప్రొటెక్షన్ మనీ.. బీజేపీకి.. కేసీఆర్‌ నుండి అందుతోంది. టీఆర్‌ఎస్‌.. బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న ముసుగు ఇది. బీఆర్‌ఎస్‌ అవినీతిని పట్టించుకోకుండా ఉండేందుకు బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ అందుతుంది. ఈ విధ్వంసంలో సోమేశ్.. అరవింద్ కుమార్ బాధ్యులు’ అని రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version