Site icon NTV Telugu

Revanth Reddy : దమ్ముంటే మునుగోడు చౌరస్తా కొస్తాం రండి

Revanth Reddy

Revanth Reddy

చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం.. ప్రచారం కోసం ఉంచిన జెండాలు, పోస్టర్లు తగలబడడం అనుమానాలకు తావిస్తోందని.. టీఆర్ఎస్‌, బీజేపీ నేతలే ఈ ఘటనకు ఒడిగట్టి ఉంటారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. దొంగల్లాగా రాత్రిపూట మా ఆఫీస్ కార్యాలయం తగలబెట్టడం కాదు దమ్ముంటే మునుగోడు చౌరస్తా కొస్తాం రండి అని సవాల్‌ విసిరారు. చేతికి ఎదిగిన కొడుకు ఇల్లరికం పోయినట్టు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడని, సీపీఎం పార్టీని దెబ్బడం పార్టీ అని కేసిఆర్ తిట్టిన ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారంటూ ఆయన ఎద్దేవా చేశారు. దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ లో చేర్చుకొని పార్టీ లేకుండా చేసిన సీపీఐ నేతలు కేసీఆర్ కి మద్దతు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటెయ్యండని ఆయన కోరారు.

Exit mobile version