NTV Telugu Site icon

Telangana New CM: సీఎం పోస్ట్ కోసం సీనియర్లు విశ్వప్రయత్నం.. చివరికి రేవంతే..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే, గత రెండు రోజులుగా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగిన చివరకు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించింది. ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సీనియర్లతో చర్చలు.. ఇలా చాలా కసరత్తుల తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ పేరును వెల్లడించింది. ఇక, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఏక్యవాఖ్య తీర్మానం అప్పగించగా.. ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Read Also: Cotton Farming: పత్తిలో తెగుళ్ల నివారణ చర్యలు..

అయితే, డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. నిన్న (సోమవారం) గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ పరిశీలకులు ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించడంతో సీఎం రేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. సీఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్‌ మున్షీ, జార్జ్‌, అజయ్‌, మురళీధరన్‌ కూడా హాజరయ్యారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను మల్లికార్జున ఖర్గేకు ఇవ్వడంతో ఆయన పలువురు నేతలతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించిన తర్వాత సీఎం కూర్చి కోసం పలువురు సీనియర్లు పోటీ తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే, రేవంత్ రెడ్డికి పార్టీలోకి కొత్తగా వచ్చాడు.. అతనికి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. కానీ, చివరికి రేవంత్ రెడ్డినే సీఎంగా ఏఐసీసీ అధిష్టానం ప్రకటించింది.