Site icon NTV Telugu

Revanth Reddy: మా కొత్త నగరం పేరు ‘భారత్‌ ఫ్యూచర్‌’ సిటీ!

Revanth Reddy Speech

Revanth Reddy Speech

హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్‌ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్‌ ఫ్యూచర్‌’ సిటీ అని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు అవకాశాలను క్రియేట్‌ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని, మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పేరుతో ఇచ్చిన స్ఫూర్తిని తాను ఫాలో అవుతాను ఐ సీఎం చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సుకు సీఎం రేవంత్ హాజరయ్యారు.

సదస్సులో ‘విజన్ తెలంగాణ రైజింగ్ 2047’ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం జరుగుతుంది. మా కొత్త నగరం పేరు ‘భారత్‌ ఫ్యూచర్‌’ సిటీ. నాలెడ్జితో పాటూ పెట్టుబడులు కావాలి. తెలంగాణలో ఆర్గానికి పంటలు పండుతున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది. రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ చేశాం. ప్రపంచంలోనే డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారండి. ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టండి. నాలెడ్జ్ హబ్‌పై ఫోకస్ పెట్టండి. ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా.. వాళ్లకు పూర్తిగా మా సపోర్ట్ ఉంటుంది’ అని చెప్పారు.

Also Read: Revanth Reddy: తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు.. కేసీఆర్‌పై సీఎం సెటైర్లు!

‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నా డ్రీమ్. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పేరుతో ఇచ్చిన స్ఫూర్తిని నేను ఫాలో అవుతాను. ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఎంతో ఆలోచనతో ప్లాన్ చేశాం. ఒలింపిక్స్‌లో సౌత్ కొరియా తెస్తున్న మెడల్స్ చూస్తే ఆశ్చర్యమేస్తోంది. దేశం పొలిటికల్గా ఫెయిల్యూర్ వల్ల ఒలింపిక్స్‌లో మెడల్స్ కొట్టలేకపోతున్నాం. మాకు ఎటువంటి పోర్ట్ లేదు. అందుకే మచిలీపట్నం పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే విత్ రైల్వే లైన్ కావాలని కోరుతున్నాం. 2025 డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం. 40 శాతం బల్క్ డ్రగ్స్ తెలంగాణ ఉత్పత్తి చేస్తోంది. వాక్సిన్లు కూడా తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. మా సిస్టమ్ మీకు అనుకూలంగా ఉంది, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టం. అమెరికా అనుమతి ఇవ్వకపోతే తెలంగాణకు రండి’ అని సీఎం సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలను కోరారు.

Exit mobile version