NTV Telugu Site icon

Revanth Reddy : తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైంది

Revanth Reddy

Revanth Reddy

ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగిందన్నారు. 120 రోజుల్లో జరిగే ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలి.. కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ను ఎలా ఓడించాలని, బీజేపీనీ ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు.

Also Read : Meenakshi Chaudhary: చీరకట్టులో సెగలు రేపుతున్న మీనాక్షి చౌదరి

పది సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగి పోయిందని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చర్చ జరిగిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ ను గద్దె దింపేందుకు సిద్ధం అయ్యామని, తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలయిందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో ఏ ఫార్ములాతో ఎలా అధికారం ఏర్పాటు చేశామో.. అలాంటి మౌలిక సూత్రాలు తెలంగాణలో ఫాలో అవుతామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల సన్నాహలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై చర్చించామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించి ఎలా విజయం సాధించాలనే విషయంపై చర్చించామని పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Tragic Accident: హోటల్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి