ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. పాదయాత్ర రాహుల్ గాంధీ ఉత్సాహంతో పాల్గొనడమే కాకుండా.. పాదయాత్రలో ఉన్నవారితో రన్నింగ్‌లు, వ్యాయమాలు సైతం చేయిస్తున్నారు. అయితే.. తాజాగా.. ఈ నేపథ్యంలో.. కామారెడ్డి – నిజాంసాగర్ లో భారత్ జోడో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ పాదయాత్రపై ప్రజల్లో చర్చ లేకుండా చేసేందుకు.. టీఆర్ఎస్-బీజేపీల ఫాం హౌజ్ డ్రామా ఆడుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు.
Also Read :T20 World Cup: సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని డ్రామాలాడిన రాహుల్ పాదయాత్రకు ప్రజల్లో విశేష స్పందన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే మూడు రోజులు.. రాహుల్ పాదయాత్ర అత్యంత కీలకమన్నా రేవంత్ రెడ్డి.. కర్ణాటక తరహాలో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే.. మద్నూర్ మండలం మేనూరు లో భారత్ జోడో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాహుల్ పాదయాత్రలో ఇప్పటి వరకు పాల్గొనని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతారని, కార్తీక పౌర్ణమి రాత్రి సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మీదుగా మహారాష్ట్రకు భారత్ జోడో యాత్ర ప్రవేశించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.