CM Revanth Reddy 57th Birthday: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 57వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖ నేతలు ఆయనకు విషెస్ చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ (DK Shivakumar), హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) కూడా రేవంత్ రెడ్డికి విష్ చేశారు. ఇక రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు.. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X – Twitter) లో మోడీ ఒక పోస్ట్ చేశారు. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని తన మెసేజ్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక లేఖను సైతం రాశారు. ప్రస్తుతం మనం అమృత్ కాల్ యుగంలో ఉన్నామని, దేశం వేగంగా అభివృద్ధి, సమగ్రత వైపు అడుగులు వేస్తోందని ఆ లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి తనవంతు కృషిని ఇలాగే కొనసాగిస్తారని తాను నమ్ముతున్నట్లు ప్రధాని ఆకాంక్షించారు.

