NTV Telugu Site icon

Aadhaar: తల్లీబిడ్డలను కలిపిన ఆధార్.. ఎనిమిదేళ్ల తర్వాత..

Aadhar

Aadhar

Aadhaar: ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఎక్కువగా ఉపయోగపడే ఆధార్‌ కార్డు.. తప్పిపోయిన వికలాంగ బాలుడిని దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన తల్లిదండ్రులను కలవడానికి ఉపయోగపడింది. 2015లో తప్పిపోయిన హైదరాబాద్‌ బాలుడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది ఆధార్‌ టీమ్. ఆధార్‌ సహాయంతో అతడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు సంతోషంగా ఉందని ఆధార్‌ బృందం ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన బాలుడు 2015లో హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. కొన్నేళ్ల తర్వాత ఆధార్‌ పుణ్యమా అని ఆ బాలుడు తన తల్లిదండ్రుల వద్దకుచేరాడు. ఆధార్ గుర్తింపు ద్వారా తప్పిపోయిన పిల్లలను తిరిగి కలిపిన కేసులు చాలా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

Also Read: Bihar: “ఇలాంటివి కొత్త కాదు”.. పోలీస్ అధికారి హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఆ బాలుడి ఆధార్‌ నమోదు సమయంలో రికార్డుల్లో ఓ మొబైల్ నంబర్‌ అనుసంధానించి ఉందని.. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తో బాలుడు తండ్రి మాట్లాడరని ఆధార్ అధికారులు వెల్లడించారు. అలా ఆ బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చామన్నారు అధికారులు. తమ కొడుకును తమ వద్దకు చేర్చినందుకు అధికారులకు తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.