Virender Sehwag : రిటైర్మెంట్ తర్వాత తెలుగు సినిమాలే నా లోకం: వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ లైఫ్ గురించి సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘టాలీవుడ్ ప్రో లీగ్’ (TPL) ఈవెంట్లో పాల్గొన్న ఆయన, క్రికెట్ నుండి తప్పుకున్నాక ఏం చేస్తున్నారో చెప్పారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలపై తనకున్న ఇష్టాన్ని సరదాగా పంచుకున్నారు.. వీరేంద్ర మాట్లాడుతూ.. ‘క్రికెట్ ఫార్మాట్లు, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు నాకు వేరే పని ఏమీ లేదు, ఖాళీ దొరికినప్పుడల్లా మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూడటమే నా పని’ అంటూ నవ్వులు పూయించారు.
Also Read : OTT Piracy : ఓటీటీల చేతకానితనమే పైరసీకి వరమా?
Also Read
సెహ్వాగ్ మాటల్లో మన టాలీవుడ్ స్టార్ల పట్ల ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్ధం అంతుంది.. అంతే కాదు ‘నాకు టాలీవుడ్లో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అలాగే ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాను ఒకటి కాదు, ఏకంగా రెండు సార్లు చూశాను’ అని .. మన దగ్గర భాష అర్థం కాకపోయినా, హిందీ డబ్బింగ్లో అయినా సరే ఈ సినిమాలను అస్సలు వదలనని ఆయన చెప్పారు. అల్లు అర్జున్ క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ‘పుష్ప’ సినిమాలోని “సాలా ఝుకేగా నహీ” (తగ్గేదేలే) డైలాగ్ తనకెంతో ఇష్టమని, ఆ మేనరిజం తనకింకా గుర్తుందని గుర్తు చేసుకున్నారు.ఈ ఈవెంట్లో సెహ్వాగ్‌తో పాటు కపిల్ దేవ్, సురేష్ రైనా కూడా పాల్గొనగా, నిర్మాత దిల్ రాజు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!