Crime News: దారుణం.. కళ్లలో కారం కొట్టి, గొంతు కోసి రిటైర్డ్ టీచర్ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: నంద్యాలలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. గ్లాడిస్ అనే రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు పాశవికంగా హత్య చేశారు. కళ్ళలో కారం కొట్టి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి పెళ్లి చేసి ఆమె ఒంటరిగా నివసిస్తోంది. భర్త మోహన్ సుధాకర్ రావు దూరదర్శన్ లో పనిచేస్తూ రిటైర్మెంట్ తరువాత మృతి చెందారు.
Read Also: Coal Mine Accident: బొగ్గు గనిలో పెను ప్రమాదం.. 12 మంది మృతి!
Also Read
ఇద్దరు కూతుర్లు పెళ్లిళ్లు చేసుకొని హైదరాబాద్‌లో స్థిరపడడంతో గ్లాడిస్ ఒంటరిగా ఉంటోంది. దుండగులు పక్కాగా రెక్కీ చేసి టీచర్ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని ఆమె ఇంటికి దొంగలు వెళ్లారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టీచర్ కళ్లలో కారం కొట్టి, గొంతుకోసి హత్య చేశారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎంత సొమ్ము దోచుకెళ్లారనే విషయంపై ఆరా తీస్తున్నారు. భారీగా బంగారం, నగదు అపహరించినట్లు మృతురాలి బంధువులు పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. మృతురాలి కూతుర్లు, బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..