Site icon NTV Telugu

YSRCP: పార్లమెంట్‌ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలు రీజనల్‌ కోఆర్డినేటర్లకు అప్పగింత

Ysrcp

Ysrcp

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఆదేశాల మేరకు వివిధ రీజనల్‌ కో-ఆర్డినేటర్లకు పార్లమెంట్‌ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను వైసీపీ అధిష్ఠానం అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించగా.. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి బాధ్యతను అప్పగించారు.

Read Also: Amit Shah: రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండదు.. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు..

కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్‌ కోఆర్డినేటర్‌గా పి.రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌గా కె.సురేష్‌బాబును నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version