Site icon NTV Telugu

Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

Rbi

Rbi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC సమావేశ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడించారు. ఫిబ్రవరిలో మాదిరిగానే, రెపో రేటు 5.25% వద్ద యథాతథంగా ఉంటుందని తెలిపారు. అంటే రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. దీని అర్థం మీ గృహ రుణం లేదా కారు రుణం EMI పెరగకుండా లేదా తగ్గకుండా యథాతథంగా ఉంటుంది. MPC సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ, గవర్నర్ సంజయ్ మల్హోత్రా, కమిటీ తటస్థ వైఖరిని కొనసాగించిందని తెలిపారు. రెపో రేటు యథాతథంగా ఉంది, SDF 5%, MSF 5.50% వద్ద కొనసాగుతాయి. అంతేకాకుండా, FY27కి వాస్తవ GDP వృద్ధి 6.9%గా అంచనా వేశారు.

Exit mobile version