Site icon NTV Telugu

Republic Day : రేపు రాజ్‌ భవన్‌లోనే రిపబ్లిక్‌ డే వేడుకలు

Raj Bhavn

Raj Bhavn

గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్‌లో కాకుండా రాజ్‌భవన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం లేఖ ఇవ్వడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కరోనా పేరుతో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోకపోవడం పట్ల గవర్నర్ తన బాధను వ్యక్తం చేశారు. అయితే.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకూడదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మాధవి సారథ్యంలోని ధర్మాసనం కొద్దిసేపటి కిందటే ఆదేశాలు వెలువడించింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకూడదంటూ ఇదివరకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.

Also Read : Padma Awards 2023: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

2022లో కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో… రాజ్‌​భవన్‌లోనే పోలీస్‌ పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

Also Read : Malikapuram Review: మాలికాపురం (మళయాళం డబ్బింగ్)

న్యాయస్థానం ఆదేశాల తర్వాత పోలీసు అధికారులు, సాధారణ పరిపాలనా శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్కే భవన్‌లో సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ప్రోటోకాల్ సంచాలకులు అర్విందర్ సింగ్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజ్​భవన్‌లో వేడుకల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

Exit mobile version