Site icon NTV Telugu

Republic Day celebrations: భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

Russian Embosy

Russian Embosy

నేడు భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 90 నిమిషాల పరేడ్‌లో భారతదేశం తన సైనిక శక్తితో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. మహిళా శక్తితో పాటు దేశంలోని ప్రజాస్వామ్య విలువలపై దృష్టి సారించే ఈ గొప్ప వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఇక, ఢిల్లీలో జరిగే 75వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో కర్తవ్య మార్గంలో జరుగుతున్నాయి. భారత్ 15 ఆగష్టు 1947న బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందింది.. కానీ 26 జనవరి 1950న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. ఈ రోజున దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

Read Also: TSPSC Chairman: నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకోనున్న మహేందర్ రెడ్డి

అయితే, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. రష్యా రాయబార కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఈ వీడియోలో గదర్ సినిమాలోని ‘మెయిన్ నిక్లా గడ్డి లేకే…’ పాటకు రష్యన్ ఎంబసీ ఉద్యోగులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో ఒక నిమిషం 29 సెకన్ల ఉంది. రష్యన్ ఉద్యోగులు వివిధ నృత్యాలు- విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఇక, ఈ వీడియో చివరలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సిబ్బంది అందరితో కలిసి హ్యాపీ రిపబ్లిక్ డే కార్డ్‌లను పట్టుకుని కనిపించారు.

Exit mobile version