NTV Telugu Site icon

Republic Day Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Kishan

Kishan

హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రామ చందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని అవమానిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం స్ఫూర్తి అర్థం కాదు.. రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు నుండి ప్రతి ఇంటికి, ప్రతి బస్తీకి వెళ్లి.. అంబేద్కర్, రాజ్యాంగం గొప్పదనాన్ని వివరించాలని తెలిపారు. మన దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ.. బీజేపీ మనసా వాచా అంబేద్కర్ ఆలోచనలకి, రాజ్యాంగానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ సర్కారు ఏ ప్రభుత్వంన్నా కూల్చలేదని అన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత మోడీదని తెలిపారు. ఓట్ల కోసం మోడీ పథకాలు తీసుకురాలేదు.. గ్యారంటీల పేరుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది.. మభ్య పెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Republic Day Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు..

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గొప్ప రాజ్యంగం అందించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం మనది.. అన్ని వర్గాలకు సమానత్వం అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదించిందని తెలిపారు. రాజ్యాంగంను, అంబేద్కర్‌ను అడుగడుగున కాంగ్రెస్ అవమాన పరిచింది.. మోడీ రాజ్యాంగం విలువలను దేశ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ను నెహ్రూ ఓడించారు.. కులాల పరంగా రిజర్వేషన్‌లను వ్యతిరేకించింది నెహ్రూ అని తెలిపారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు.. అంబేద్కర్ జాతీయ నాయకుడని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Read Also: Female Hostages Released: హమాస్ బందీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల