Site icon NTV Telugu

Lok Sabha Elections 2024: పోలింగ్ సరళిని పరిశీలించేందుకు 23 దేశాల నుండి 75 మంది ప్రతినిధులు..

Ec Rajeev

Ec Rajeev

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ‘లోక్‌సభ ఎన్నికల’లో జరిగే అతిపెద్ద పండుగను చూసేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఇండియాకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, “మా ఆహ్వానం మేరకు, 23 దేశాల నుండి ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు మా ఎన్నికలను చూసేందుకు ఇక్కడకు రావడం చాలా సంతోషం మరియు సంతృప్తిని కలిగించే విషయం.” అని పేర్కొన్నారు.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా గెలిచినా వదిలిపెట్టేది లేదు: బీజేపీ

“వివిధ దేశాల నుండి దాదాపు పది మంది ఛైర్‌పర్సన్‌లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌లు ఇండియాకు వచ్చారు. వారు ఐదు నగరాలు, ఐదు రాష్ట్రాలకు వెళుతున్నారు. అక్కడ పోలింగ్ బూత్‌లను సందర్శించి భారతదేశంలో ప్రజాస్వామ్య పండుగను ఎలా జరుపుకుంటున్నారో చూస్తారన్నారు” రాజీవ్ కుమార్. మరోవైపు.. ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమీషనర్ తెలిపారు. ఓటు ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి బాధ్యత, తాము ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అయితే.. రెండు దశల్లో ఓటింగ్ శాతం 66 శాతం కంటే ఎక్కువే నమోదైంది. అయితే మూడో దశ, తదుపరి దశల్లో అది కూడా దాటుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు.

Thummala: జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అనలేదు

ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ (IEVP) సంస్థ ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడాన్ని ఎన్నికల సంఘం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో.. భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, మాల్దీవులు, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి 23 దేశాలు పాల్గొంటున్నాయి. కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు, పాపువా న్యూ గినియా మరియు నమీబియా నుండి వివిధ ఎన్నికల నిర్వహణ సంస్థలకు (EMBలు) ప్రాతినిధ్యం వహిస్తున్న 75 మంది ప్రతినిధులు పాల్గొంటారు.

Exit mobile version