Reporters Begging: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ గరౌత అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జర్నలిస్టులు వీధుల్లోకి వచ్చి భిక్షాటన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. బీజేపీ ఎమ్మెల్యే జవహర్‌లాల్ రాజ్‌పుత్ ఇక్కడి 5 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. దీనికి వ్యతిరేకంగా జర్నలిస్టులు భిక్షాటన చేసి రూ. 250 కోట్లు వసూలు చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు ఊరు ఊరు తిరిగి భిక్షాటన చేస్తామని చెప్పారు.
ITBP Constable Recruitment: దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త.. ఐటీబీపీలో ఉద్యోగాలు..
స్థానిక కథనాల ప్రకారం., అక్రమ మైనింగ్ వార్తలను ప్రచురించి ప్రసారం చేసినందుకు ఎమ్మెల్యే రాజ్‌పుత్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ ప్రెసిడెంట్ పుష్పేంద్ర యాదవ్, అశుతోష్ నాయక్, ధీరేంద్ర రైక్వార్, డికు జైన్, రామ్‌నరేష్ లకు పరువు నష్టం నోటీసు పంపారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై నిత్యం అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని రాసినా.. ప్రసారం చేసినా.. టార్గెట్ గా పెడుతున్నారని జర్నలిస్టులు అంటున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారని ఆరోపించారని జర్నలిస్టులు తెలిపారు.
Surya: కంగువ ట్రైలర్ వచ్చేసింది.. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే..?
ये सब झांसी जिले के पत्रकार हैं,
भीख मांगकर 250 करोड़ रूपए इकट्ठा कर रहे हैं,
इनका कहना है कि गरौठा विधायक जवाहर लाल राजपूत ने जिले के पांच पत्रकारों को 50-50 करोड़ की मानहानि का नोटिस दिया है,पत्रकारों का कहना है कि अवैध खनन की खबर चलाने से विधायक जी नाराज हैं,
अब देखो मसला… pic.twitter.com/EMIaoES2vL
— ANIL (@AnilYadavmedia1) August 11, 2024