Site icon NTV Telugu

Renuka Chowdhury : ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా..?

Renuka Choudari

Renuka Choudari

రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మనిషిపై లక్ష కు పైగా అప్పు భారం వేసింది బీఆర్ఎస్‌ పార్టీ అని, దొంగ విత్తనాలు మూలంగా 8 మే మంది రైతు కుటుంబాల నాశనం ఐతే కేసీఆర్ నోరు మేధపని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార మదం తో విర్రవిగుతున్న కేసీఆర్ కి సవాల్ అని,
కౌలు రైతు ని మర్చిపోయింది ఈ ప్రభుత్వమన్నారు. కౌలు రైతులకు దృష్టి లో పెట్టుకుంది కాంగ్రెస్ అని ఆమె ఉద్ఘాటించారు. కాళేశ్వరం వల్ల బంగారం అంత కేసీఆర్ ఫామిలీ ఇంటికి చేరిందన్నారు రేణుకా చౌదరి. గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పక్కన పెట్టి గెలిస్తే రైతులకి కేసీఆర్ చేసింది ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.

Also Read : CM KCR : మార్చి తర్వాత ఆసరా పింఛన్ 5 వేలు ఇస్తాం

ధరణి పోర్టల్ తోకేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా.? మీపార్టీ నేతలు చేసిన దోపిడీ ప్రజలు గమనిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. క్వాలిటీ కంట్రోల్ ఏం అయింది కాళేశ్వరం విషయం లో అని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి…? పక్కన ఊరు ప్రజల గురించి ఆలోచించారా అని రేణుకా చౌదరి అన్నారు. పంటకు రేట్లు ఆడిగితే జైలు శిక్షలు ..నాలల్లో నీళ్లు రాని పరిస్థితి అని, నిజమైన కంఠం మొగహకుడదు అని కాంగ్రెస్ గొంతు నొక్కి ప్రయత్నాలు చేసింది బీఆర్‌ఎస్‌ అని ఆమె అన్నారు. ఎందుకు ధరణి పోర్టల్ పనిచేయటం లేదు.. సామాన్యుడికి మేలు జరిగిందా పోర్టల్ వల్ల అని, కేజీ టూ పీజీ అన్నారు.. బీఆర్‌ఎస్‌ నేతలు చదువుకుంటే బాగుండేదని రేణుకా చౌదరి సెటైర్‌ వేశారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ అని ఒప్పుకొని చెంపలు వెసుకో కేసీఆర్ అని రేణుకా చౌదరి అన్నారు.

Also Read : 12th Fail Movie Review: బాలీవుడ్లో దుమ్మురేపిన 12త్ ఫెయిల్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Exit mobile version