Site icon NTV Telugu

Fali S Nariman: సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయనిపుణుడు నారిమన్ కన్నుమూత..

Nariman

Nariman

ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ ఇవాళ ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా పని చేసిన అనుభవం ఉంది. నారిమన్ 1950లో తొలుత బాంబే హైకోర్టు నుంచి న్యాయవాద వృత్తిని స్టార్ట్ చేశారు. 1961లో సీనియర్ అడ్వకేట్‌గా ఎన్నికయ్యారు. 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిని ఆయన చేపట్టారు. 1972లో సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత ఆయన భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమకం అయ్యారు. నారిమన్ తన విశేష కృషికి జనవరి 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు.

Read Also: SIP : సిప్ లో పెట్టుబడి పెట్టడం ఎందుకు లాభదాయకం.. 4కారణాలు

ఇక, నారిమన్‌ సీనియర్ న్యాయవాదితో పాటు 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటు అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా పని చేశారు. నారిమన్ 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా విధులు నిర్వహించారు. అతను 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా బాధ్యతలను తీసుకున్నారు.

Read Also: TS EAPCET-2024 : విద్యార్థులకు అలెర్ట్..ఈఏపీసెట్ నోటిఫికేషన్‌ విడుదల..

కాగా, నారీమన్ మృతి పట్ల సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సంతాపం ప్రకటించారు. నారిమన్‌ను గుర్తు చేసుకుంటూ.. మానవ తప్పిదాలకు గుర్రపు వ్యాపారం అనే పదాన్ని ఉపయోగించడం గుర్రాలను అవమానించడమేనని నారిమన్ తెలిపారు అనే విషయాన్ని సింఘ్వి గుర్తు చేశారు. ఆయన (నారిమన్) న్యాయ చరిత్రలో లోతైన రహస్యాలను ఆవిష్కరిస్తూ.. మాట్లాడేటప్పుడు వాటిని తన జ్ఞానంతో సాటిలేని విధంగా అనుసంధానించేవారని తెలిపారు. దీంతో పాటు పలువురు ప్రముఖులు నారిమన్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version