NTV Telugu Site icon

Renault, Nissan Vehicles: ఉమ్మడిగా వాహనాలను ఉత్పత్తి చేయనున్న రెనాల్ట్‌, నిస్సాన్‌

Renault, Nissan Vehicles

Renault, Nissan Vehicles

Renault, Nissan Vehicles: ఇటీవలే ఒక్కటైన రెండు కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్‌ మరియు నిస్సాన్‌.. తమ ఫస్ట్‌ జాయింట్‌ ప్రాజెక్ట్‌ వివరాలను వెల్లడించాయి. ఇండియాలో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను కూడా ప్రకటించాయి. ఇందులో భాగంగా 600 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో చెన్నైలోని మ్యానిఫ్యాక్షరింగ్‌ ప్లాంట్‌ని డీకార్బనైజ్‌ చేయనున్నాయి.

కొత్త మోడల్‌ కార్ల తయారీ ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఆరు కొత్త వాహనాలను ఉత్పత్తి చేయనున్నాయి. ఇందులో భాగంగా రెండు విద్యుత్‌ కార్లను మరియు నాలుగు SUVలను రూపొందిస్తాయి. మన దేశంలోని వినియోగదారులతోపాటు దక్షిణాసియా దేశాలు మరియు ఇతర విదేశాలకు ఎగుమతులు లక్ష్యంగా కూడా ఈ వెహికిల్స్‌ని మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి.

read more: Companies Names-Full Forms: మనకు తెలియని 40 ఆసక్తికరమైన అంశాలు

ఈ రెండు కంపెనీలు చెరో మూడు చొప్పున ఆరు వాహనాలను రూపొందించి ఉత్పత్తి చేయనున్నాయి. చెన్నైలోని కార్ల తయారీ ప్లాంట్‌ని 2045 నాటికి కార్బన్‌ న్యూట్రల్‌గా తీర్చిదిద్దుతాయి. ఇదిలా ఉండగా.. ఈ రెండు సంస్థలు విలీనమయ్యేందుకు ఏర్పాటుచేసుకున్న ఒప్పందం ప్రకారం.. నిస్సాన్‌ సంస్థలోని వాటాను రెనాల్ట్‌ కంపెనీ భారీగా తగ్గించుకోనుంది.

గతంలో 43 శాతం షేరును కలిగి ఉండగా భవిష్యత్తులో 15 శాతంతో సరిపెట్టుకోనుంది. దీనికి ప్రతిఫలంగా నిస్సాన్.. రెనాల్ట్ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ యూనిట్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు సోమవారం ఉమ్మడిగా ప్రకటన చేశాయి. రెనాల్ట్‌ మరియు నిస్సాన్‌ వెల్లడించిన ఈ ఫస్ట్‌ జాయింట్‌ ప్రాజెక్టు ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌ మోటర్‌ సెక్టార్‌లో సైతం కీలకమైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.