Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Renault Launches Attractive Offer With 3 Year Or 1 Lakh Km Warranty To Boost Sales In 2025

Renault Offer: బంపర్ ఆఫర్.. లక్ష కి.మీ.ల వారంటీ అంటున్న రెనాల్ట్

Published Date :January 3, 2025 , 12:14 pm
By Kothuru Ram Kumar
  • బంపర్ ఆఫర్ ప్రకటించిన రెనాల్ట్..
  • 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ ప్లాన్‌
  • అంతేకాకుండా మరెన్నో ఆఫర్స్..
Renault Offer: బంపర్ ఆఫర్.. లక్ష కి.మీ.ల వారంటీ అంటున్న రెనాల్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Renault Offer: ప్రస్తుతం దేశీయంగా కార్ల వాడకం విపరీతంగా పెరిగిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంతో, కార్ల తయారీదారులు కొత్త మోడళ్లతో తమ సేల్స్‌ను పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీటిలో రెనాల్ట్ (Renault) కూడా కీలకంగా నిలిచింది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన రెనాల్ట్ కంపనీ 2025 సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. మరి ఆ ఆఫర్ ఏంటంటే.. 2025 సంవత్సరం కొత్త ఆఫర్‌తో రెనాల్ట్ తన వాహనాలపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 1, 2025 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రత్యేక ఆఫర్‌తో, కొత్తగా రెనాల్ట్ వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు వాహనంలోని మెకానికల్, మెటీరియల్, తయారీ లోపాలు, ఎలక్ట్రికల్ వైఫల్యాలకు సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినా, అదనపు ఛార్జీలు లేకుండా పరిష్కరించబడతాయనమాట.

Also Read: WhatsApp Location Trace: వాట్సాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

రెనాల్ట్ ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు 24×7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, యాక్సిడెంటల్ టోయింగ్ కవరేజీ వంటి సౌకర్యాలను కూడా అందిస్తోంది. కస్టమర్లు తమ వారంటీని 4, 5, 6, లేదా 7 సంవత్సరాల పాటు వరకు పొడిగించుకోవచ్చు కూడా. ఇది 1,00,000 కి.మీ., 1,20,000 కి.మీ., 1,40,000 కి.మీ. లేదా అపరిమిత కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, రెనాల్ట్ భారత దేశంలో క్విడ్ (Kwid), కైగర్ (Kiger), ట్రైబర్ (Triber) మోడల్స్‌ను విక్రయిస్తోంది. ఈ 2025 సంవత్సరంలో, రెనాల్ట్ డస్టర్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ డస్టర్ మోడల్ 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇది రెనాల్ట్‌కు భారతదేశంలో మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు కీలకంగా మారనుంది.

Also Read: South Korea : ప్రజల నిరసన, రెడీగా పోలీసులు.. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ కు రంగం సిద్ధం

రెనాల్ట్ ఈ కొత్త ఆఫర్, కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించడం ద్వారా 2025లో సేల్స్‌ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఈ ఆఫర్ ద్వారా ఇతర పెద్ద కార్ల కంపెనీలను సమర్థంగా పోటీ చేసే అవకాశం రెనాల్ట్‌కు లభించనుంది. రెనాల్ట్, తమ సరికొత్త ఆఫర్‌తో పాటు కొత్త డస్టర్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయాలని భావిస్తుంది. దీని ద్వారా, రెనాల్ట్ మరోసారి తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025 Offers
  • Car Warranty
  • Car Warranty Extension
  • Duster
  • Kiger

తాజావార్తలు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు

  • Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions