Renault Duster 3rd Generation Launch and Specs: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ‘రెనాల్ట్ డస్టర్’కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఆటోమేకర్ ‘రెనాల్ట్’ నుంచి వచ్చిన ఈ ఎస్‌యూవీ.. భారత మార్కెట్‌లో సక్సెస్ అయింది. 2021లో ఫస్ట్ జనరేషన్ డస్టర్ అమ్మకాలను నిలిపివేయగా.. ప్రస్తుతం సెకండ్ జనరేషన్ డస్టర్ అందుబాటులో ఉంది. ఇక థర్డ్ జనరేషన్ డస్టర్ నవంబర్ 29న మార్కెట్‌లోకి రానుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
రెనాల్ట్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన ‘డాసియా’ థర్డ్ జనరేషన్ డస్టర్‌ని తయారు చేసింది. నవంబర్ 29న పోర్చుగల్‌లో ఈ కొత్త డస్టర్ ఎడిషన్‌ను అధికారికంగా డాసియా ఆవిష్కరించనుంది. ఈ 5-సీటర్ ఎస్‌యూవీ 2025 నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డాసియా కంపెనీ ఈ లేటెస్ట్ డస్టర్‌ని 7-సీటర్ వెర్షన్‌లో కూడా రిలీజ్ చేయనుంది. అయితే ఈ కారు లాంచింగ్ గురించి కంపెనీ ఇప్పటివరకు ఏ వివరాలను వెల్లడించలేదు.
థర్డ్ జనరేషన్ డస్టర్ మూడు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది. ఇవి వేర్వేరు డ్రైవింగ్ ప్రిఫరెన్స్‌తో రానున్నాయి. ఎంట్రీ లెవల్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 120 bhp పవర్ అవుట్‌పుట్ అందించనుంది. రెండోది 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ 140 bhp పవర్ కాగా.. మూడోది 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 170 bhp వపర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
Also Read: IQOO 12 Launch: నవంబర్ 7న ‘ఐకూ 12’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. సూపర్ డిజైన్, హై ఎండ్ ఫీచర్స్!
రెనాల్ట్ ఇటీవల బ్రెజిల్‌లో డస్టర్‌ను ప్రదర్శించగా.. ఫోటోలు లీక్ అయ్యాయి. ఫొటోస్ చూస్తే.. కొత్త మోడల్ ప్రస్తుత సెకండ్ జనరేషన్ కంటే భిన్నంగా ఉంది. రెనాల్ట్-నిస్సాన్ సంయుక్తంగా డెవలప్ చేసిన CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కారును అభివృద్ధి చేశారు. ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌లో స్మార్ట్‌ఫోన్ కంపాటబిలిటీ, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఇందులో ఉండనున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాహనాలకు ఈ కారు పోటీ ఇవ్వనుంది.