Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు.
అల్లం కషాయం: దీనిని తయారు చేయడానికి ముందుగా వేడి నీటిలో అల్లం వేసి ఉడికించాలి. తరువాత ఆ నీటిని ఓ గుడ్డలో వేసి వడకట్టాలి. తరువాత ఆ నీటిలో కొంచెం తేనే వేసుకొని తాగాలి. అల్లంలో ఇన్ఫెక్షన్లను పోగొట్టే లక్షణాలు ఉంటాయి. అందుకే దీనిని తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. లేదా అల్లం టీ లాంటివి తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.
తులసి, మిరియాల కషాయం: దీని కోసం కొన్ని తులసి ఆకులు, మిరియాలు కలిపి నీటిలో ఉడికించాలి. తరువాత వాటిని వడకట్టి ఆ నీటిని తాగాలి. త్వరగా ఫలితం రావాలంటే ఆ నీటిని గొంతుకు తగిలేలా ఉంచాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది.
మిరియాలు, బాదం కషాయం: దీని కోసం ముందుగా నల్ల మిరియాలను, బాదం పప్పులను కలిపి పొడిగా చేసుకోవాలి. దానిోల కొంచెం నెయ్యి కలిసి తీసుకోవాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. నల్ల మిరియాల పొడిని నీటిలో వేసుకొని తాగిన తొందరగా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక గొంతునొప్పి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆ సమయంలో గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి. కూల్ డ్రింక్స్, చల్లని పానీయాలు, చల్లని నీటిని తాగడం ఆపేయాలి. వీలైనంత వరకు వేడిగా ఉండే పదార్థాలనే తీసుకోవాలి.