NTV Telugu Site icon

Jio 3GB Recharge Plans: రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్స్.. ప్రతిరోజూ 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

Reliance Jio

Reliance Jio

Reliance Jio 3GB Data Prepaid Recharge Plans 2023: ఒకప్పుడు 1 జీబీ డేటాను నెల మొత్తం వాడుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ లాంటివి అందుబాటులోకి రావడంతో 1జీబీ డేటా ఒక్క గంటలోనే అయిపోతుంది. కొంతమందికి రోజూ 2-3 జీబీ డేటా కూడా సరిపోవడం లేదు. ఎక్కువగా వీడియోలు చూసేవారికి, బ్రౌజింగ్ చేసేవారికి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికీ డేటా ఎక్కువగా అవసరం అవుతుంది. అలాంటి వారి కోసం ‘రిలయన్స్ జియో’ ప్రత్యేక ప్లాన్స్ అందిస్తోంది. రోజూ 3జీబీ డేటాతో కొన్ని ప్లాన్స్ అందిస్తోంది. ఆ ఫాన్స్ ఏంటో ఓసారి చూద్దాం.

Jio 999 Plan:
రిలయన్స్ జియో రూ. 999 ప్లాన్‌లో 84 రోజుల వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 3జీబీ డేటా చొప్పున 252జీబీ వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 40జీబీ డేటా అదనంగా వస్తుంది. అంటే 84 రోజులలో 292జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ లాంటి యాప్స్‌కి యాక్సెస్ ఉంది. వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

Also Read: IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో చివరి వన్డే.. కోహ్లీ ఔట్! ఓపెనర్‌గా రోహిత్

Jio 399 Plan:
రిలయన్స్ జియో రూ. 399 ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రూ. 61 విలువైన 6జీబీ డేటా అదనంగా లభిస్తుంది. మొత్తంగా 90జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్‌కి అనుమతి ఉంది.

Jio 219 Plan:
రిలయన్స్ జియో రూ. 219 రీఛార్జ్ ప్లాన్‌కు 14 రోజుల వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. అంటే 14 రోజుల్లో 42జీబీ డేటాను మీరు వినియోగించుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో రూ. 25 విలువైన 2జీబీ డేటా అదనంగా లభిస్తుంది. మొత్తంగా 44 జీబీ డేటా వాడుకోవచ్చు. 14 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ లాంటి యాప్స్‌కి యాక్సెస్ ఉంటుంది. 5జీ డేటా కూడా లభిస్తుంది.

Also Read: IND vs IRE: కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా.. ఐపీఎల్‌ స్టార్లకు పిలుపు! ఐర్లాండ్‌తో టీ20లకు భారత జట్టు ఇదే