NTV Telugu Site icon

Reliance Jio OTT Plans: 21 నుంచి 7కు.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌లను తగ్గించేసిన జియో!

Reliance Jio

Reliance Jio

Reliance Jio Best OTT Plans 2024: ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్‌ జియో’ ఇటీవల తన మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల ధరలను 12 నుంచి 27 శాతం మేర పెంచింది. దాంతో చాలా మంది ఉపయోగించే ప్లాన్‌లు భారీగా పెరిగాయి. జులై 3 నుంచి సవరించిన ప్లాన్‌ల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌లతో పాటు ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌లను జియో సవరించింది. అయితే కొన్ని ప్లాన్‌లను పూర్తిగా తొలగించింది. గతంలో 21 ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 7 మాత్రమే ఉన్నాయి.

మొన్నటివరకు సోనీ లివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో (2.5జీబీ) రూ.3662 ప్లాన్.. సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో (2 జీబీ) రూ.3226 ప్లాన్‌.. జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో (2జీబీ) రూ.3225 ప్లాన్‌.. ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో (2జీబీ) రూ.3227 ప్లాన్‌.. డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో (2జీబీ) రూ.3178 లాంటి వార్షిక ప్లాన్‌లను అందించింది. ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌ వంటి 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన రూ.4498 లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉండేవి. ఇప్పుడు లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌లను జియో తొలగించింది.

Also Read: Sikandar Raza: చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. సూర్యకుమార్‌తో కలిసి..!

ప్రస్తుతం 7 ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌ వంటి 12 రకాల ఓటీటీ ప్రయోజనాలతో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ఉంది. ఈ డేటా ప్లాన్‌ ధర రూ.175. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 84 రోజులకు రోజుకు 2 జీబీ డేటాతో రూ.1299 ప్లాన్‌.. 3జీబీ డేటాతో రూ.1799 ప్లాన్‌ ఉంది. 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటాతో రూ.1029కి ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో మరో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌ ఉంది. ఫ్యాన్‌కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో 2.5జీబీ వ్యాలిడిటీతో రూ.3999కి లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. మ్యూజిక్‌ లవర్స్ కోసం సావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో రూ.889, రూ.329 ప్లాన్‌లను జియో అందిస్తోంది.

 

 

Show comments