Reliance Jio OTT Plans: 21 నుంచి 7కు.. ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసిన జియో!
- టారిఫ్ ధరలను పెంచిన జియో
- జులై 3 నుంచి అమల్లోకి
- ఇప్పుడు 7 మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Jio Best OTT Plans 2024: ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ ఇటీవల తన మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 12 నుంచి 27 శాతం మేర పెంచింది. దాంతో చాలా మంది ఉపయోగించే ప్లాన్లు భారీగా పెరిగాయి. జులై 3 నుంచి సవరించిన ప్లాన్ల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్లతో పాటు ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను జియో సవరించింది. అయితే కొన్ని ప్లాన్లను పూర్తిగా తొలగించింది. గతంలో 21 ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 7 మాత్రమే ఉన్నాయి.
మొన్నటివరకు సోనీ లివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో (2.5జీబీ) రూ.3662 ప్లాన్.. సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్‌తో (2 జీబీ) రూ.3226 ప్లాన్.. జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో (2జీబీ) రూ.3225 ప్లాన్.. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో (2జీబీ) రూ.3227 ప్లాన్.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో (2జీబీ) రూ.3178 లాంటి వార్షిక ప్లాన్లను అందించింది. ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి 15 ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో కూడిన రూ.4498 లాంగ్‌టర్మ్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉండేవి. ఇప్పుడు లాంగ్‌టర్మ్ ప్లాన్లను జియో తొలగించింది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
Also Read: Sikandar Raza: చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. సూర్యకుమార్‌తో కలిసి..!
ప్రస్తుతం 7 ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్ వంటి 12 రకాల ఓటీటీ ప్రయోజనాలతో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఉంది. ఈ డేటా ప్లాన్ ధర రూ.175. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 84 రోజులకు రోజుకు 2 జీబీ డేటాతో రూ.1299 ప్లాన్.. 3జీబీ డేటాతో రూ.1799 ప్లాన్ ఉంది. 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటాతో రూ.1029కి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో మరో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఉంది. ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌తో 2.5జీబీ వ్యాలిడిటీతో రూ.3999కి లాంగ్‌టర్మ్ ప్లాన్ అందుబాటులో ఉంది. మ్యూజిక్ లవర్స్ కోసం సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో రూ.889, రూ.329 ప్లాన్లను జియో అందిస్తోంది.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..