NTV Telugu Site icon

CM Chandrababu: రాజధాని పునర్‌ నిర్మాణం చేసి తీరాల్సిందే.. చంద్రబాబు భావోద్వేగం

Chandrababu

Chandrababu

అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సుమారు ఐదు నిమిషాల పాటు అమరావతి విధ్వంసంపై వీడియో రిలీజ్ చేశారు. కాగా.. వీడియో ప్లే అవుతున్నప్పుడు సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విధ్వంసం జరిగిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపారు. ఎంతో ఆలోచించి ప్రణాళికలు వేస్తే.. సర్వ నాశనం చేశారని ఆరోపించారు. సింగపూర్ దేశాన్ని మళ్లీ అప్రోచ్ కావాలి.. రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహకరిస్తుందా..? లేదా..? అనేది చూడాలన్నారు. పెట్టుబడులు ఎంత వరకు వస్తాయో తెలీదు..?. తన ట్రాక్ రికార్డు చూసి వచ్చినా.. ఏపీకి వస్తే ఏమవుతుందోననే ఆందోళన పెట్టుబడిదారుల్లో కన్పిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేశారు.. జగన్ పాలన ఏపీకి శాపంగా మారిందని దుయ్యబట్టారు.

Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..

జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా..? అని ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు తెలిపారు. ఐదేళ్ల పాటు రాజధానిలో నిర్మాణాలు నిలిపేశారు.. రోడ్లను తవ్వుకుని వెళ్లిపోయారని అన్నారు. ఐదేళ్ల పాటు ఇలా వదిలేస్తే.. ఐరన్ ఎంత వరకు పనికి వస్తుందోననేది చూడాలన్నారు. 2019లో అమరావతి నిర్మాణాలు ఎక్కడి వరకు ఉన్నాయో.. అక్కడితోనే ఆపేశారని పేర్కొన్నారు. రాజధానికి జరిగిన నష్టం ఎంత అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులోనే రూ. 169 కోట్లు నష్టం వచ్చిందని అన్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూనే, కొత్త ఆలోచనలు.. ప్రతిపాదనలు వస్తే వాటినీ పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు. రూ. 50 వేల కోట్లు ఖర్చు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలని భావించాం.. తక్కువ కాలంలోనే రూ. 30 వేల కోట్లు తిరిగి వచ్చేవన్నారు. ప్రతి రంగంలోనూ టాప్-10 సంస్థలను అమరావతికి రప్పించాలని భావించాం.. త్వరలోనే పునర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.. దానికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చంద్రబాబు చెప్పారు.

Immunity Boost Drinks : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలా.. వీటిని తాగాల్సిందే..

రాజధాని పునర్‌ నిర్మాణం చేసి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం చేపట్టాలనే కూటమికి ప్రజలు ఓటేశారని తెలిపారు. జగన్‌ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు.. ఇబ్బందులు ఉంటాయి.. కానీ పునర్ నిర్మాణం చేసి తీరాల్సిందేనని చెప్పారు. నాలుగో సారి సీఎం అయ్యాను.. ప్రతిసారి ఛాలెంజ్ గా తీసుకుని పని చేశాను.. ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదుర్కొలేదన్నారు. అధికారులు సహా అందరి ఆలోచనా విధానం మారిపోయింది.. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. చెత్త వేసే వాళ్లే తప్ప.. చెత్త తీసే వాళ్లు లేని పరిస్థితికి ఏపీని తెచ్చారని చంద్రబాబు తెలిపారు.