NTV Telugu Site icon

Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. పరిస్థితి ఎలా ఉందంటే..?

Sri Tej

Sri Tej

Release of Shri Teja Health Bulletin: సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని.. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది. అప్పుడప్పుడు పిట్స్ లాంటివి వస్తున్నాయి.. కళ్ళు తెరుస్తున్నాడు, కానీ మనుషుల్ని గుర్తు పట్టడం లేదని కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు..క్లారిటీ ఇచ్చిన ఎన్డీయే..

పుష్ప సినిమా ప్రీమియర్ సిమ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అని మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. శ్రీ తేజ ఆరోగ్యంపై హీరో అల్లు అర్జున్ అన్నీ చూసుకుంటున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్, సీపీ సీవీ ఆనంద్ లాంటి పలువురు ప్రముఖులు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు. ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.

Read Also: Heavy Rains: తీరం వైపు దీసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు..