బీజేపీపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరిగే అరాచకాలు, దోపిడీని, నిరంకుశ పాలను, ఎండగడుతు రైతుల ఎజెండాతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నీతి అయోగ్ ఫైరావ్ చేసిన నిధులు విడుదల చేయకుండా ఆటంకపరిచి కేసీఆర్ని బదనం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక పాలనలో పోటీ పడలేక బిజెపి జండా పట్టుకోవాలని చదువుకునే యువకులను తప్పుదోపటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా పేపర్ లీక్ వెనక సూత్రధారి పాత్ర దారి బండి సంజయ్ అని, కేసీఆర్ అభివృద్ధి చూడలేక, తట్టుకోలేక, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Virender Sehwag: ఏంటా చెత్త బ్యాటింగ్.. యువ ప్లేయర్‌పై సెహ్వాగ్ ఘాటు విమర్శలు
పేపర్ లీకేజీ వక్రీకరించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరు తప్పు చేసినా చట్టం ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేలను పట్టుకునేందుకు, కొనటానికి వచ్చి, దొంగలు పట్టు పడ్డారని, మొన్న లీకేజీ అయిన టీఎస్పీఎస్సీ పేపర్, ఇవాళ లీకైన హిందీ పేపర్ లీకేజీకి కారుకులు బండి సంజయ్ అనుచరులే అని ఆయన అన్నారు. పేపర్ లీకేజీ కారకుడైన ప్రశాంత్‌తో 142 కాల్స్ మాట్లాడిన ఆధారాలు ఉన్నాయని, ఈశాన్య రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో, చేసినట్లుగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఉందని గుర్తుపెట్టుకుని నడవాలన్నారు. నికృష్ట రాజకీయాలు చేస్తే ఊరుకోమని ఆయన అన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో ఎవరిని వదిలిపెట్టమని, అందర్నీ బొక్కలో పెడతామన్నారు.
Also Read : Tirupati IIT: జూన్ నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్ సిద్ధం
