NTV Telugu Site icon

Kerala: ప్రభుత్వ కార్యాలయంలో రీల్స్..8మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

Reels

Reels

ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియాకు బాగా ఎడిక్ట్‌ అయ్యారు. ఈ పిచ్చి రోజు రోజుకూ ముదురుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్‌, ఫాలోవర్స్‌ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరు లైక్స్ కోసం విన్యాసాలు చేస్తూ..ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ రీల్స్ పిచ్చి క్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మొదలైంది. తాజాగా కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్ల మున్సిపాలిటీ కార్యదర్శి రీల్స్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు డ్యాన్స్, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో డ్యాన్స్ చేస్తూ.. పాటలు పాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఉన్నతాధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు.

READ MORE: Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన

కాసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మున్సిపల్‌ సెక్రటరీ దృష్టికి రావడంతో వెంటనే ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ చర్యపై సెక్రటరీని మీడియా ప్రశ్నించగా.. ఈ చర్య గురించి తెలిసి తాను తన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు. అయితే బుధవారం నోటీసు అందజేయగా.. కార్యాలయం పని చేయని సమయంలో ఈ రీల్‌ను చేశామని.. ఆ ఉద్యోగులు చెప్పుకొచ్చారు. దీని వల్ల పని కోసం వచ్చే ప్రజలకు, వారి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు.