REDMI Note 15 Pro Series: భారత మార్కెట్లో రెడ్ మీ నోట్ 15 ప్రో (REDMI Note 15 Pro) సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో REDMI Note 15 Pro 5G, REDMI Note 15 Pro+ 5G అనే రెండు మోడళ్లు ఉన్నాయి. డిజైన్ నుంచి బ్యాటరీ, కెమెరా నుంచి AI ఫీచర్ల వరకు ఈ సిరీస్‌లో అనేక కీలక అప్‌గ్రేడ్స్‌ను అందించింది. మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దామా..
బిల్డ్ క్వాలిటీ & రగ్గడ్ డిజైన్:
ఈ రెడ్ మీ నోట్ 15 ప్రో సిరీస్‌ను బలమైన నిర్మాణంతో డిజైన్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 డిస్ప్లే ప్రొటెక్షన్ అందిస్తూ.. డ్రాప్, బెండ్, క్రష్ టెస్టుల్లో SGS ప్రీమియం పెర్ఫార్మన్స్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. అలాగే ఇందులో IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉండడం వల్ల 2 మీటర్ల లోతులో 24 గంటల వరకు నీటిలో ఉన్నా సేఫ్ గా ఉంటుంది. ఇక Pro+ మోడల్లో ఫైబర్ గ్లాస్ బ్యాక్ ఇంపాక్ట్ అబ్సార్ప్షన్ కోసం కొత్తగా పరిచయం చేసిన Wet Touch 2.0 ద్వారా చేతులు లేదా స్క్రీన్ తడిగా ఉన్నా టచ్ స్పందన తగ్గదు.
Bhumana Karunakar Reddy: జగన్‌ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకున్నారు..
కెమెరా & AI ఫీచర్లు:
ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ 200MP శాంసంగ్ HPE సెన్సార్ (1/1.4-inch) నిలుస్తుంది. ఇది 2x, 4x ఆప్టికల్ లెవల్ జూమ్, 23mm నుంచి 92mm వరకు 5 ఫోకల్ లెంగ్త్‌లు, Triple-focal-length DAG HDR వంటి మెరుగైన డైనమిక్ రేంజ్ తో పాటు AI క్రియేటివిటీ అసిస్టెంట్ ఫోటో ఎడిటింగ్ సులువుగా చేసుకోవచ్చు. ఇంకా డైనమిక్ షాట్స్ 2.0 ద్వారా మోషన్ ఎఫెక్ట్స్, ఆబ్జెక్ట్ రిమూవల్ చేయవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరాగా Pro మోడల్ లో 20MP, Pro+ మోడల్ లో 32MP ఉన్నాయి.

పనితీరు & హార్డ్‌వేర్:
వివిధ యూజర్ల అవసరాల కోసం రెండు వేర్వేరు ప్రాసెసర్లు ఉన్నాయి. ఇక REDMI Note 15 Pro+ 5G లో Snapdragon 7s Gen 4 (4nm) ఉండి.. Xiaomi ఐస్ లూప్ కూలింగ్ సిస్టం సాధారణ కూలింగ్ కంటే 3 రెట్లు మెరుగైన హీట్ మేనేజ్మెంట్ అందించనుంది. ఇక REDMI Note 15 Pro 5G లో మీడియాటెక్ డిమెంసిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. అలాగే ఇవి ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2, గూగుల్ జెమినీ, సర్కిల్ టూ సెర్చ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. Pro+ మోడల్లో ప్రత్యేకంగా HyperAI ఇంటిగ్రేషన్ కలిగి ఉంది.
RK x KH : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే
అదనపు ఫీచర్ల విషయానికి వస్తే.. వీటిలో Surge T1S ట్యూనర్ ద్వారా మెరుగైన సిగ్నల్ స్టెబిలిటీ లభిస్తుంది. దీని ద్వారా నెట్వర్క్ లేకున్నా పనిచేసే ‘ఆఫ్ లైన్ వాయిస్ కమ్యూనికేషన్’ లభిస్తుంది. ఇక డిస్ప్లే, ఆడియో విషయానికి వస్తే.. 6.83 అంగుళాల 1.5K OLED డిస్ప్లే (Pro, Pro+), 120Hz రిఫ్రెష్ రేట్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, 400% వరకు వాల్యూమ్ బూస్ట్ (ఎంచుకున్న మోడళ్లలో) ఉంది.

ఈ సిరీస్‌లో తొలిసారిగా సిలికాన్ కార్బన్ (SiC) బ్యాటరీ టెక్నాలజీను ప్రవేశపెట్టింది. 15 Pro 5G మోడల్ లో 6500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండగా.. 15 Pro+ 5G మోడల్ లో 6580mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ ఉంది. REDMI Note 15 Pro 5G కార్బన్ బ్లాక్, సిల్వర్ యాష్, మిరాజ్ బ్లూ రంగుల్లో లభిస్తుండగా.. REDMI Note 15 Pro+ 5G కార్బన్ బ్లాక్, కాఫీ మోచా, మిరాజ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
Phone Tapping కేసులో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు?
ధరలు:
REDMI Note 15 Pro 5G:
* 8GB + 128GB – రూ. 29,999
* 8GB + 256GB – రూ. 31,999
REDMI Note 15 Pro+ 5G:
* 8GB + 256GB – రూ.37,999
* 12GB + 256GB – రూ.39,999
* 12GB + 512GB – రూ.43,999
ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్, mi.com, అధికారిక రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అవుతాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా HDFC, SBI, ICICI బ్యాంక్ కార్డులతో రూ. 3000 వరకు డిస్కౌంట్ లభించనుంది.
The search for the ultimate smartphone ends here. Meet the #REDMINote15Pro 5G.#200MasterPixelCamera, IP69K Durability and 6580mAh Battery.
Now that's #SimplySuperb.
Starting at ₹26,999* | First sale on 4th Feb
Pre-Book Now: https://t.co/eClqzAU0Hj pic.twitter.com/f5NFeWC3yF— Redmi India (@RedmiIndia) January 29, 2026