REDMI Note 12 Pro 5G Flipkart and Xiaomi India Offers: చైనాకు చెందిన మొబైల్ సంస్థ ‘షావోమీ’ ఈ ఏడాది ప్రారంభంలోనే రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో తక్కువ ధరకు వస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 4 వేల తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ వివరాలు ఓసారి చూద్దాం.
రెడ్‌మీ నోట్ 12 ప్రో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999.. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999.. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999లుగా ఉంది. ప్రస్తుతం ధరలు తగ్గడంతో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ. 23,999కి.. 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ. 24,999కి, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ. 29,999కి, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 32,999కి ధరకు సొంతం చేసుకోవచ్చు.
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 27,999 ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 23,999కి అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999 ఉండగా.. ఇప్పుడు రూ. 24,999కి వస్తోంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 32,999లకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా 5 శాతం బ్యాంక్ ఆఫర్ సహా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
షావోమీ ఇండియా వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో కొంటే రూ. 3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. రెడ్‌మీ, షావోమీ మొబైల్స్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. రూ. 4000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఇతర మోడల్స్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. రూ.3000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే. ఈ ఫోన్ కొనాలంటే ఇపుడే కొనేసుకోండి.
Also Read: Virat Kohli Century: విదేశాల్లో 15 సెంచరీలు చేశా.. అదేమీ చెత్త రికార్డు కాదు: విరాట్ కోహ్లీ