NTV Telugu Site icon

Redmi A5: 5200mAh బ్యాటరీతో Redmi కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల.. ధర రూ. 6 వేలు మాత్రమే

Redmi

Redmi

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ మరో కొత్త ఫోన్ Redmi A5 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది భారత్ లో కాదు. Redmi A5 ఇండోనేషియాలో విడుదల చేశారు. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్‌సెట్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌లో పనిచేస్తుంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇది 6.88-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్ తో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో Poco C71గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Also Read:Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు

ఇండోనేషియాలో Redmi A5 ధర 4GB + 128GB వేరియంట్ కు IDR 1,1,99 (సుమారు రూ. 6,100)గా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్ లేక్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, శాండీ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. Redmi A5 6.88-అంగుళాల HD+ (720×1,640 పిక్సెల్స్) డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, ట్రిపుల్ TÜV రీన్‌ల్యాండ్ ఐ-ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఈ స్క్రీన్ వెట్ టచ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. Redmi A5 ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని, 4GB LPDDR4X RAM, 128GB eMMC 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిందని Xiaomi ధృవీకరించింది.

Also Read:Harish Rao : రైతు భరోసా అమలుపై హరీష్ రావు ఆగ్రహం.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

ఫోటోగ్రఫీ కోసం, Redmi A5 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. దీనిలో 32-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (f/2.0 ఎపర్చరు), సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ముందు కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. Redmi A5 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, AI-బ్యాక్డ్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం 4G VoLTE, Wi-Fi, FM రేడియో, బ్లూటూత్ 5.2, GPS, GLONASS, గెలీలియో, BDS (B1C మాత్రమే), USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.