చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్‌బ్రాండ్ రెడ్‌మీ ఎంట్రీ లెవల్‌లో ‘రెడ్‌మీ ఏ5’ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్‌టెల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్‌టెల్ ఎడిషన్ ఫోన్‌ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
రెడ్‌మీ ఏ5లో ఎయిర్‌టెల్ ముఖ్యమైన ప్రయోజనాలను కూడా అందిస్తోంది. వినియోగదారులు 7.5 శాతం తగ్గింపు, 50జీబీ ఉచిత డేటాను పొందుతారు. ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే ముందు మీరు షరతులను తెలుసుకోవాలి. ఇది 4జీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సెకండరీ ఫోన్‌గా వాడుకోవాలనుకునే వారికి మంచి ఆప్షన్. రెడ్‌మీ ఏ5 భారతదేశంలో రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఇది 3జీబీ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత రూ.299 రీఛార్జ్ అవసరం. ఎయిర్‌టెల్ సిమ్ కార్డుతో మాత్రమే ఇది వర్క్ అవుతుంది.
Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మ చరిత్ర.. అప్పుడే విరాట్ కోహ్లీ క్లబ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!
రెడ్‌మీ ఏ5 ఫోన్ 6.88-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 650 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. కంపెనీ రెండు సంవత్సరాల అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇచ్చింది. ఈ మొబైల్ ఫోన్ 5200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 32MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. IP52 రేటింగ్‌ను కలిగి ఉంది.
