Site icon NTV Telugu

Red Sandalwood: ఫామ్‌ హౌస్‌లలోని సెప్టిక్ ట్యాంకుల్లో ఎర్రచందనం.. నలుగురు అరెస్ట్

Red Sandalwood

Red Sandalwood

Red Sandalwood: దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కల్వకుర్తి, కడప వాసులుగా గుర్తించారు. వారిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి అతి సమీపంలో ఫ్యూచర్ సిటీ వెంచర్ వద్ద ఉన్న రెండు ఫామ్ హౌస్‌లలో సెప్టిక్ ట్యాంకులతో పాటు భూమిలో పాతిపెట్టిన ఎర్రచందనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

CBI Chargesheet: లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ చార్జిషీట్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన ఇనాయత్ ఖాన్, అబ్దుల్ ఖాదర్ ఖురేషిలతో పాటు కడప జిల్లాకు చెందిన రవిచంద్ర, షేక్ అబ్దుల్లా,(ప్రొద్దుటూరు) ముజాహిద్దీన్‌లు ఈ స్మగ్లింగ్ పాల్పడినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు పంపగా.. రవిచంద్ర పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు.

Exit mobile version