NTV Telugu Site icon

ViduthalaiPart2 : ఫస్ట్ పార్ట్ హిట్.. భారీ నష్టాలను మిగిల్చుతున్న విడుదల 2

New Project (83)

New Project (83)

ViduthalaiPart2 : సూరి హీరోగా మారి తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. కాగా విడుదలై చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్- 2 ఇటీవల విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

Read Also: TG Congress Protest: నేడు ట్యాంక్‌బండ్‌ వద్ద కాంగ్రెస్ నిరసనలు.. కలెక్టరేట్ వరకు పాదయాత్ర..

ఈ డిసెంబర్ నెల లోనే పలు క్రేజీ సీక్వెల్ చిత్రాలు విడుదల అయ్యాయి. మరి ఆ చిత్రాలే మన టాలీవుడ్ నుంచి భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 అలాగే కోలీవుడ్ సినిమా నుంచి “విడుదల 2”. అయితే ఈ రెండిట్లో ఒకటి మాత్రం ప్లాప్ గానే మిగిలిపోయే విధంగా ఉంది.

Read Also: Himachal Pradesh: ఓరి దేవుడా మనాలీలో మంచు దుప్పటి.. చిక్కుకుపోయిన 1000 వెహికిల్స్!

మరి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 భారీ వసూళ్లు అందుకుంటుంది. కానీ విజయ్ సేతుపతి వెట్రిమారన్ ల కలయికలో వచ్చిన విడుదల 2 మాత్రం నష్టాలనే మిగిల్చేలా ఉందట. తెలుగులో కూడా అంత మంచి టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం తమిళ్ లో కూడా భారీగా డ్రాప్ అయ్యినట్లు తెలుస్తుంది. దీనితో ఎంతో కాలం నుంచి తీసిన ఈ సినిమా సరైన స్పందన అందుకోలేకపోయింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రెడ్ జెయింట్ మూవీస్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంయుక్తంగా నిర్మించింది.

Show comments