Realme P3 Lite 5G:రియల్‌మీ (Realme) తన సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P3 లైట్ 5G (Realme P3 Lite 5G)ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అనేక మంచి ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తోంది. దీని డిజైన్, పనితీరు బడ్జెట్ ఫోన్ల మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేయనుంది. మరి ఈ కొత్త మొబైల్ ఫీచర్స్ ను చూసేద్దామా..
ఈ ఫోన్ 6.67-అంగుళాల HD+ 120Hz LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది గేమింగ్ ఆడడానికి, వీడియో చూడడానికి మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ మొబైల్ లో MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ ఉంది. అలాగే ఇందులో 4GB లేదా 6GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. అంతేకాకుండా 12GB వరకు డైనమిక్ RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0తో పనిచేస్తుంది.
Mirai: డే 2> డే 1…రచ్చ రేపుతున్న మిరాయ్ కలెక్షన్స్..

కెమెరా విషయానికొస్తే, రియల్‌మీ P3 లైట్ 5G వెనుక భాగంలో 32MP ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. అలాగే ఇది మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందిందని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఒకటిగా 6000mAh భారీ బ్యాటరీని చెప్పవచ్చు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Hyderabad : హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు డబుల్ అణక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ షాకింగ్ రిపోర్ట్

రియల్‌మీ P3 లైట్ 5G పర్పుల్ బ్లోసమ్, మిడ్‌నైట్ లిల్లీ, లిల్లీ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇక ధర విషయానికొస్తే.. 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 10,499 కాగా, 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ సెప్టెంబర్ 22 నుండి ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌గా వినియోగదారులకు రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తుంది.
