NTV Telugu Site icon

Realme P3: పవర్‌ఫుల్ ఫీచర్లతో కొత్త మొబైల్స్ను లాంచ్ చేసిన రియల్‌మీ

Realme P3 5g

Realme P3 5g

Realme P3 5G: రియల్‌మీ కంపెనీ భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అధునాతన టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరలతో ఈ బ్రాండ్ భారత స్మార్ట్ ఫోన్స్ మర్కెట్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. గేమింగ్ లవర్స్, కెమెరా ఫీచర్స్ యూజర్ల కోసం విభిన్నమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెస్తూ, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో తన హవాను కొనసాగిస్తోంది. తాజాగా, రియల్‌మీ అత్యాధునిక ఫీచర్లతో కూడిన రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Read Also: CM Revanth Reddy : హైకోర్టులో ఊరట.. రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత

రియల్‌మీ P3 5G, రియల్‌మీ P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ ఇంకా ఎంటర్‌టైన్మెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసారు. ఇది మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. నేడు (మార్చి 19)న జరిగిన ఎర్లీ బర్డ్ సేల్‌లో రియల్‌మీ P3 5G కొనుగోలు చేసిన వారికి ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద బేస్ వేరియంట్ కేవలం రూ.14,999కే అందుబాటులో ఉంది. అదనంగా, బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగులలో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. ఇక 6GB RAM + 128GB స్టోరేజ్ రూ.16,999, 8GB RAM + 128GB స్టోరేజ్ రూ.17,999 , 8GB RAM + 256GB స్టోరేజ్ రూ.19,999 గా ధరలు నిర్ణయించబడ్డాయి.

Read Also: Nagpur riots: నాగ్‌పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..

ఇక రియల్‌మీ P3 5G ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో Snapdragon 6 Gen 4 5G చిప్‌సెట్ అందించబడింది. 4nm ఆర్కిటెక్చర్‌తో ఈ ప్రాసెసర్ అత్యధిక వేగంతో పని చేస్తుంది. ఇది గేమర్స్ కు బాగా ఉపయోగపడుతుంది. అలాగే 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండే డిస్‌ప్లే లభిస్తుంది. ఇక బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఇందులో 6,000mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ అందించారు. లాఫ్ IP69 రేటింగ్, BGMI 90fps సపోర్ట్ అందించారు. ఈ ఫీచర్ల ద్వారా గేమింగ్ అనుభవం మరింత అద్భుతంగా మారుతుంది.