Realme Neo 7: రియల్‌మీ నియో 7 వచ్చేవారం చైనాలో లాంచ్ కాబోతోంది. ధర పరంగా రియల్‌మీ నియో 7 కంపెనీ వాల్యూ ఫ్లాగ్‌షిప్‌గా ప్రారంభమైన రియల్‌మీ జీటీ7 ప్రో కంటే కొంచెం దిగువన స్లాట్ చేయబడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 11న లాంచ్ చేయడానికి ముందు, రియల్‌మీ ఇప్పటికే నియో 7 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. దీంతో ఈ ఫోన్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. అధికారిక లాంచ్‌కు ముందు, రియల్‌మీ నియో 7 బ్యాటరీ పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన కీలక వివరాలను సంస్థ ధృవీకరించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 23 గంటల వీడియో ప్లేబ్యాక్, 89 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 14 గంటల వీడియో కాలింగ్ లభించే విధంగా 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ కోసం చూసే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ చక్కటి ఆప్షన్ అవుతుంది. చైనాలో ఎంఐఐటీ సర్టిఫికేషన్ సందర్భంగా రియల్‌మీ నియో 7 ఫోన్ ఫస్ట్ లుక్ రివీల్ చేయబడింది. పర్ఫార్మెన్స్ పరంగా.. రియల్‌మీ నియో 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఫోన్ 70 శాతం అల్ట్రా వైడ్ కవరేజీతో వస్తోంది.
రియల్ మీ నియో-7 స్పెసిఫికేషన్లు
*6.78 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే
*120Hz రిఫ్రెష్ రేట్
*మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్
*ఆండ్రాయిడ్ 15
*50ఎంపీ+8ఎంపీ వెనుక కెమెరా
*16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
*7000 ఎంఏహెచ్ బ్యాటరీ
*8.56 మి.మీ మందంతో స్మిమ్ ప్రొఫైల్
*213 గ్రాముల బరువు
రియల్‌మీ నియో 7 పూర్తి స్పెక్స్ విషయానికొస్తే, ఇది 6.85-అంగుళాల అమోల్‌డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 2780 x 1264 పిక్సెల్‌లను కొలుస్తుంది. ఇది బహుశా LTPO ప్యానెల్ కావచ్చు.రియల్‌మీ నియో 7 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP f/1.9 ప్రైమరీ సెన్సార్, 8MP f/2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ పరికరం ఆండ్రాయిడ్ 15-ఆధారిత Realme UI 6.0లో రన్ అవుతుందని భావిస్తున్నారు.రియల్‌మీ నియో 7 గరిష్టంగా 16GB RAM, 1TB వరకు నిల్వను కలిగి ఉంటుంది. 7000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో వైఫై, బ్లూటూత్, జీపీఎస్, NFC, IR బ్లాస్టర్, ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్ ఉంటుంది. పరికరం IP రేటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. స్టీరియో స్పీకర్‌లతో అమర్చబడి ఉంటుంది.