ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇప్పటివరకు వరకు వచ్చిన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చేసింది.. రియల్ మీ నార్జో 70 ప్రో మొబైల్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మి నార్జో 70 ప్రో ఫ్లాట్-స్క్రీన్ డిజైన్‌తో స్లిమ్ బెజెల్స్, హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ వినియోగదారులు హారిజోన్ గ్లాస్ డిజైన్‌ను పొందవచ్చు.. అలాగే అక్టో -కోర్ ప్రాసెసర్, మాలి-జీ68 జీపీయూతో గేమింగ్, మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.. కెమెరా విషయానికొస్తే.. సెన్సార్ జూమ్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది… సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు.. ఇక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికొస్తే..6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది..
ఇక ధర విషయానికొస్తే… గ్రీన్, గ్లాస్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వంటి రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది.. ఇక 8జీబీ+128జీబీ వేరియంట్ ఫోన్ ధర చూస్తే.. 19,999 ఉండగా.. 8జీబీ+256 జీబీ ధర రూ. 21,999 ఉంది.. అదే విధంగా ఈ ఫోన్ మార్చి 22 నుంచి మార్కెట్ లోకి రాబోతుంది..ప్రముఖ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ఉంటుందని తెలుస్తుంది..